మహిళా శక్తికి ప్రతీకగా నిలిచి, సమాజంలో మార్పుకు నాంది పలికిన ప్రతి మహిళకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. ఎస్సార్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు….

ఎస్సార్ నగర్ మార్చి 7(జే ఎస్ డీ ఎం న్యూస్)

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మహిళా శక్తికి ప్రతీకగా నిలిచి సమాజంలో మార్పుకు నాంది పలికిన ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదులు.
మహిళా దినోత్సవo సందర్బంగా ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పని చేసే మహిళా సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి, వారిని పూల మాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ స్త్రీలు శక్తి వంచనలేకుండా ప్రతి రంగంలో తమదైన రీతిలో పని చేస్తూ, తగిన గుర్తింపు పొందుతున్నారు. రాజీ పడకుండా, మగ వారికి దేనిలోనూ తీసి పోకుండా అన్ని రకాల వృత్తులలో నేటి మహిళలు రాణిస్తున్నారన్నారు. ఉదయం ఇంటి నుండి మొదలు దేశ పరిపాలన వరకు అన్ని రకాల పనులలో నేటి మహిళలు రాణిస్తున్నారు. ఇరవై యేండ్ల కిందట ప్రమాదవశాత్తు భర్త మరణించిన దైర్యం కోల్పోకుండా ,కుమారుడిని తీసుకొని హైదరాబాద్ కి వచ్చి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ, నేడు కుమారుడిని మెకానికల్ ఇంజనీరింగ్ చదివించి అధికారిగా తయారు చేసిన మల్లీశ్వరి సేవలను, త్యాగాన్ని సిబ్బందికి వివరించి ఆమెను మిగతా వారు ఆదర్శంగా తీసుకొని పిల్లలను చదివించి ప్రయోజకులుగా తయారుచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *