పేటలో సందడి చేసిన కళ్యాణ్ రామ్-అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ సాంగ్ రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్

ప్రముఖ సినీనటుడు నందమూరి కళ్యాణ్ రామ్ నరసరావుపేటలో సందడి చేశారు. కళ్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా, ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటను స్థానిక రవి కళామందిర్ థియేటర్ లో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ సినిమా పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసి నందమూరి అభిమానులను అలరించారు. కళ్యాణ్ రామ్ స్టెప్పులకు థియేటర్లో అభిమానులు ఈలలు వేసి చప్పట్లు కొడుతూ ఆనందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడా అరవింద బాబు కుమారుడు డాక్టర్ చదరవాడ ఆదిత్య పాల్గొని, కళ్యాణ్ రామ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోటప్పకొండలో వేంచేసియున్న మహిమాన్వితమైన శ్రీ మేధా దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఆయనకు అందించారు. కార్యక్రమానికి మూవీ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, టిడిపి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *