ప్రపంచంలోని కార్మికుల పండుగ మేడే….. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట మే 1(జే ఎస్ డి ఎం న్యూస్)
ప్రపంచంలోని కార్మికుల పండుగ ,మేడే ,అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మేడే సందర్భంగా గురువారం మోండా డివిజన్ లోని ఓల్డ్ జైల్ ఖాన వద్ద నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధిగా తలసాని హాజరయ్యారు. మేడే జెండా ను ఎగురవేసిన అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను మేడే సందర్భంగా స్మరించుకుంటారని పేర్కొన్నారు. శ్రమకు మారు పేరు కార్మికులు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోండా డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు జయరాజ్, మహేందర్, కార్మిక సంఘం నాయకులు వెంకటేష్, సంజీవ, దశరధ్, శివ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *