ఎన్ని కూటములు వచ్చినా జగన్ దే హవా -బాబుషూరిటీ మోసం గ్యారెంటీ కి భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు –క్యూఆర్ కోడ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లండి -మాట తప్పిన నాయకులు వస్తే నిలదీయండి –బాబుషూరిటీ మోసం గ్యారెంటీలో వైఎస్సార్సీపీ నేతలు కారుమూరి, బూచేపల్లి, బత్తుల, శ్యామల

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నమ్మించి మోసం చేయడం బాబు నైజమని… ఇచ్చిన మాటకు కట్టుబడి 100శాతం హామీలు అమలు చేయడం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైజమని వైఎస్సార్ సీపీ రీజనర్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దర్శి పట్టణంలోని డాక్టర్ బూచేపల్లి నివాసం ఆవరణలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిదిగా హాజరైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ… మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం అని అర్హులందరికీ అన్నీ పధకాలు అందిస్తే…ఈవీఎంల ద్వారా సీఎం అయి చంద్రబాబు వైఎస్సార్ సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పుతున్నారంటే చంద్రబాబు ఎంత దుర్మార్గపు ముఖ్యమంత్రి ప్రజలు ఆలోచించాలన్నారు. గత ప్రభుత్వంతో జగన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స లు, 3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అండగా నిలబడితే నేడు చంద్రబాబు రైతులను గాలికొదిలేశారన్నారు. రెండెకరాలున్న చంద్రబాబు తనస్వార్థం కోసం ముఖ్యమంత్రి అయ్యి, రెండు లక్షల కోట్లు సంపాదించారని స్పష్టం చేశారు. బాబు నైజం మోడీకి కూడా తెలుసని అందుకే గత ఎన్నికలు ముందు కూటమి లో కలసి ఉన్నా చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయడని ముందే తెలిసే బీజేపీ నేతలు వారి మేనిఫెస్టోను చేతి తో కూడా తా కలేదన్నారు. కోడిని వేలగట్టి చూస్తూ కోడి బిర్యాని తిన్నట్టు ఊహించుకునే విధంగా చంద్రబాబు పధకాలు ఉన్నాయని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లను చూస్తే ఆరోగ్య శ్రీ, డ్యాంలు, అమ్మవడి, నాడు నేడు, కార్పోరేట్ విద్య, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చిహ్నలు గుర్తుకు వస్తాయని చంద్రబాబును చూస్తే వెన్నుపోటు, నయవంచన, ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన మోసగాడుగా గుర్తుకు వస్తారన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెతగా కూటమి లో ఎమ్మెల్యేలు కూడా దాచుకో, దోచుకో, పంచుకో, తినుకో అన్న సామెతగా దోపిడీ లక్ష్యంగా రాష్ట్రాన్ని పీల్చి పిప్పిని చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో స్కీంలు ఒక్కటీ అమలు కావడం లేదుకానీ స్కాంలు మాత్రం భారీగా జరుగుతున్నాయన్నారు. ఈ అవినీతి పై చంద్రబాబు ఎమ్మెల్యేలను దండించినా ఇక మరళా అధికారంలోకి రామని తెలుసుకున్న ఎమ్మెల్యేలు లిక్కర్, ఇసుక, పేకాట, రేషన్ మాఫియా లలో పచ్చగడ్డి మేసినట్లు మేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అధికారప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ….. డాక్టర్ బూచేపల్లి శివన్న జిల్లా అధ్యక్షులు అయ్యాక జిల్లాలో కార్యకర్తలు ఊపిరి పీల్చుకుంటున్నారన్నారు.. 1988 నుండి 2024వరకు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకం అమలు చేసింది లేదన్నారు. తల్లికి వందనం అంటూ అర్హులైన తల్లులకు పధకాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టారన్నారు. దీపం పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్తే ఆ దీపం వెలగకుండానే ఆరిపోయిందని ఎద్దేవా చేశారు. పధకాలు పేరుతో అప్పులు, హామీలు పేరుతో అప్పులు, అమరావతి పేరుతో అప్పులు మీద అప్పులు చేయడం, అప్పులకు చడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడం తెచ్చిన డబ్బు ఎక్కడ అంటే సమాదానం చెప్పకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా 100శాతం సంక్షేమ పధకాలు అమలు చేసిన గత ప్రభుత్వం కంటే ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా 52శాతం పైగా అప్పులు చేసి ఆడబ్బు ఏంచేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు. మరో నాయకులు పిఠాపురం పీఠాధిపతై పవన్ (పీపీపీ) తన సొంత జిల్లాలో మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడరు …కానీపక్క రాష్ట్రాల్లో ఊకదంపుడు ఉపన్యాకాలు. ఇస్తున్నారన్నారు. ఆయన జిల్లా లో ఆడపిల్లకు అన్యాయం జరిగితే మాట మాత్రం మాట్లాడలేదని ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తా, నారతీస్తా అంటారని అన్నారు. సకల శాఖా మంత్రి లోకేష్ జగన్న పధకాలు, అన్నీ తానే సృష్టించానని ప్రచారం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని
ఆ పప్పులు మాత్రం ఉడకలేదని ఎద్దేవా చేశారు. రాత్రి బొద్దింక అని చెప్పి తెల్లవారు జామున వెంట్రుక అని చెప్పే మహిళా హోంమంత్రి కూటమి పాలనలో ప్రతి గంటకు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఒక్కరోజు కూడా వచ్చి మాట్లాడలేదని మండి పడ్డారు. ప్రకాశం జిల్లాలో కూటమి నాయకుల్లో భయం మొదలైందని మనం ప్రశ్నించే స్థాయిలో ఉంటే వాళ్ళలో బోయం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… తమ జీవితాంతం వైఎస్ జగనన్నతోనే తమ పయనం ఉంటుందని నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పొదిలి పర్యటనలో టీడీపీ వాళ్ళ తప్పులు చేస్తే దాచి పెట్టి అమాయకులను జైల్లో పెట్టారన్నారు.నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అంటే భయం పట్టుకుందని సెంటర్ లో బేనర్లు వేస్తామంటే అధికార పార్టీ వాళ్ళు బయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని బేనర్లు కట్టకుండా ఆపి మీరు మా కార్యక్రమాలను ఆపలేరన్నారు. టీడీపీ నాయకులు రౌడీలు, గూండాల్లా ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. గుడివాడలో బీసీ మహిళా జడ్పీ చైర్ పర్సన్ పై దాడి చేస్తే మహిళా హోం మంత్రి అయి బాదితురాలి పైనే కేసులు పెట్టించడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారని ప్రజల హృదయాల్లో మాత్రం జగనన్నే ఉన్నారని అందుకే టీడీపీ కి
బయంపట్టుకుని అధికారులను అడ్డుపెట్టి మన జనాలు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని అంతకు రెండు రెట్లు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యకర్తలకు బూచేపల్లి కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా లో జిల్లాలో 8కి 8అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 2014లో బాబు మోసాలు చూశామని, 2024లో కూడా బాబు మోసగాడని నిరూపణ అయ్యిందన్నారు. పవన్ కళ్యాణ్ మార్కాపురంలో నిర్వహించిన సభలో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉంటామని చెప్పడమే జగనన్న అంటే వాళ్ళకు పట్టుకున్న భయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమికి ధడపట్టుకుందని చెప్పారు. మధ్యం, ఇసుక, గ్రావెల్, రేషన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి జండాలు కట్టనీయడం లేదని, ఫ్లక్సీలు కట్టనీయడం లేదని కనీసం కార్యక్రమాలకు కళ్యాణ మండపాలు కూడా ఇవ్వకుండా ఆపితే కార్యక్రమాలు ఆగిపోవని అంతకు రెట్టింపు ఉత్సాహంతో బారీగా కార్యకర్తలు హాజరయ్యారన్నారు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలని కూటమి నేతలకు హితవ పలికారు. క్యూఆర్ కోడ్ ను ప్రతి ఇంటికి చేర్చి చంద్రబాబు ఇచ్చిన హామీలు చేసిన మోసాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఎండగట్టాలని, పిలుపునిచ్చారు. పొగాకు రైతుల కోసం వచ్చిన జగనన్న కలవడానికి వస్తే 40మంది పై కేసులు పెట్టారన్నారు. తాము వారిని ఓదార్చటానికి వెళితే మీరు బాధపడకండన్నా మానాయకుడు కోసం జైలుకు వెళ్ళినా బాధపడమని జైలులో ఉన్న కార్యకర్తలు స్పష్టం చేశారన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటానని సృష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రజలను అమ్మనాన్నలా చూసుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఇంచార్జ్ బత్తుల బ్రహ్మనందరెడ్డి మాట్లాడుతూ జగన్న హయాంలో ఆయన పేరు చెప్పి సంపాదించికుని అధికారంలో లేనప్పుడు పార్టీని వదిలి వెళ్తే జిల్లాను మరింత బలోపేతం చేసేమంచి నాయకుడుగా బూచేపల్లి ని జగన్న ఎంపిక చేశారన్నారు. చంద్రబాబు పేరు చెప్తే వెన్నుపోటు, మోసాలు, దుర్మార్గాలు గుర్తుకు వస్తాయని చెప్పారు. ఆనాటి రాజన్నను. ఈనాటి జగనన్న పేరు చెప్తే ఫీజు రీఎంర్స్ మెంట్, ఆరోగ్య శ్రీలు, 108లు, 104లు, అమ్మవడి, దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామస్వరాజ్యం లో బాగంగా గ్రామగ్రామాన సచివాలయాలు గుర్తుకు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే రెడ్ బుక్ రాజ్యాంగం రాచరికపాలనను గుర్తుకు తెస్తుందని మండి పడ్డారు. చంద్రబాబు మోసాలు గురించి చెప్పాలన్నా… రాజన్న, జగనన్న సంక్షేమం అభివద్ధి కార్యక్రమాలు గురించి చెప్పాలన్నా ఒకరోజు సరిపోదని ఎద్దేవా చేశారు. అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సిపి హయాంలో అందించిన సంక్షేమం గురించి నేటి పాలకుల అరాచకం గురించి వివరించారు. ముందుగా దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రిని అతిధులను ఘనంగా సన్మానించారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర , జిల్లా ,నియోజకవర్గ మండల స్థాయిలో పార్టీలోని వివిధ హోదాలలో లో ఉన్న నాయకులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ప్రధాన కార్యకర్తలు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *