అర్హులైన బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను గుర్తించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ ఏ తమీమ్ అన్సారియా

రాష్ట్రంలోని పేదరికాన్ని రూపుమాప‌డ‌మే ల‌క్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం పి 4 విధానాన్ని రూపొందించింద‌ని, ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన బంగారు కుటుంబాలను, మార్గ దర్శకులను గుర్తించాలని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ తమీమ్ అన్సారియా
, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులతో సమావేశమై జీరో పావర్టీ పీ4 (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజలు, భాగస్వామ్యం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్) కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, జిల్లాలో 74 వేల 911 ‘ బంగారు కుటుంబా‘ లను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీరికి కావాల్సిన అవసరాలను గుర్తించడంతోపాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకులను కూడా ఈ నెల 25వ తేదీ లోపు గ్రామ, వార్డు సభలు నిర్వహించి గుర్తించాలన్నారు. పీ4 కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఇందులో మంచి ఫలితాలు రావాలంటే అధికారులు శ్రద్ధ పెట్టి మనసుతో పని చేయాలన్నారు. బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శకుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పి4 వెబ్ సైట్ లో పొందు పరచాలన్నారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, ఎన్.ఆర్.ఐ.లు, ఇతర ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా హోదాతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న అందరూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పీ4 కార్యక్రమం కింద మార్గదర్శకులు ఏం చేయాలి, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి అనేదానిపై అవగాహన కల్పించాలన్నారు. ఏ బంగారు కుటుంబాన్ని ఏ మార్గదర్శకునికి దత్తత ఇవ్వాలి అనేది చాలా ముఖ్యమైనదని అందుకనుగుణంగా సచివాలయం వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలన్నారు. మార్గదర్శకులకు వారి దగ్గర్లో ఉన్న బంగారు కుటుంబాలని దత్తత ఇవ్వాలని, దీని ద్వారా బంగారు కుటుంబాలకు మంచి జరుగుతుందన్నారు. బంగారు కుటుంబాల గురించి మార్గదర్శకులకు పూర్తిస్థాయిలో వివరాలు తెలియజేయాలని, బంగారు కుటుంబాల కష్టాలు, వారికి కావలసినది కనిపెట్టి దాని తొలిగించే కార్యక్రమం మార్గదర్శకుల ద్వారా చేయించాలన్నారు. పీ4 కార్యక్రమం పాలసీని క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిపించాలని, బంగారు కుటుంబాలకు, మార్గదర్శకులకు సమాచారం పక్కాగా ఉంటేనే ఈ కార్యక్రమం ఉద్దేశం నెరవేరుతుందని, ఇందుకనుగుణంగా క్షేత్రస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన షెడ్యుల్ ప్రకారం వార్డు, గ్రామ సభలు నిర్వహించి పి 4 కార్యక్రమ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం వుందని, దీనికి అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. మార్గదర్శకులను గుర్తించి వారికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యంను వివరించాలని జిల్లా కలెక్టర్, అధికారులకు సూచించారు. ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఈనెల 19న మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడంతో పాటు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ మాసం లో “ ప్లాస్టిక్ కాల్యుషం అంతం ” అనే అంశంతో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని అందుకనుగుణంగా దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగం ముఖ్యంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం కారణంగా ఆరోగ్యంపై కలిగించే దుష్ప్రభాలపై ప్రజలకు అవగాహన కలిగించి, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంను నివారించేలా తొలుత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై పర్యవేక్షించడం జరుగుందని కలెక్టర్ వివరించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, సత్యనారాయణ, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డ్వామా, డిఆర్డిఏ, మెప్మా, హౌసింగ్ పిడి లు జోసెఫ్ కుమార్, నారాయణ, శ్రీహరి, శ్రీనివాస ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, డిటిసి సుశీల, డిసిఓ పద్మశ్రీ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ బాల శంకర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *