జై జవాన్ – జై కిసాన్ నినాదంతో పీ పీ ఎల్ కంపెనీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పిడతలగుడిపాడు
గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు మార్కెటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ మాట్లాడుతూ… “సైనికులు దేశ సరిహద్దులను కాపాడితే, రైతులు దేశానికి అన్నం పెడతారని అన్నారు. వారి త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి” తెలిపారు.
రైతులకు అందిస్తున్న టి.ఎస్.పీ, యు.ఏ.ఎన్, ఎన్ 20 , జిప్మైట్ ప్లస్, ఇంపాక్ట్ , బయో 20,నానో శక్తి యూరియా, డిఏపీ వంటి ఆధునిక ఎరువుల వినియోగం గురించి వివరించారు. కార్యక్రమంలో సైన్యంలో పనిచేస్తున్న సైనికుడు ఎన్. శ్రీకాంత్ రెడ్డి, ఒక ప్రగతిశీల రైతును గ్రామంలో రైతులతో కలిసి కంపెనీ ప్రతినిధులు సత్కరించారు. ఈ వేడుకలో జీకేఎస్ హరికృష్ణ రెడ్డి, గోపి, డి బి టి ఎస్ వెంకట్రావు, గ్రామ రైతులు పాల్గొన్నారు.



