సాతంత్య్ర దినోత్సవ వేడుల సందర్భంగా శుక్రవారం జిల్లాలో నిర్వహించిన వేడుకలలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డును తాళ్లూరు ఎపీఎం దేవరాజ్ , గ్రంథ పాలకురాలు విజయ కుమారి అవార్డుల ను అందుకున్నారు. ఉత్తమ అవార్డులు అందుకున్న ఏపీఎంకు వెలుగు సిబ్బంది, సీసీలు, ఎంఎంఎన్ సంఘ బాధ్యులు, పలువురు నాయకులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా గ్రంథ పాలకురాలు విజయ్ కుమార్ కి పలువురు అభినందనలు తెలిపారు.


