దేశ ప్రగతికి కృషి చేద్దాం – ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహణ- మహాత్మా గాంధీ కి నివాళి -ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహణ

ప్రకాశం జిల్లా, దర్శి నియోజక వర్గం, తాళ్లూరు మండలంలో తాళ్లూరులోని ఎబీసీ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు జెండాను ఎగుర వేసారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జాతీయ సమగ్రత, స్వాతంత్య్ర స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి పౌరుడు దేశ ప్రగతికి కృషి చెయ్యాలని కోరారు. నాడు స్వరాజ్య సాధనకు కృషి చేసారని, నేడు సురాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని, ఉత్తమ క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వాతంత్య సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి చిననాటి నుండి లక్ష్యాలను ఏర్పరుచుకుని సాధనకు కృషి చెయ్యాలని అన్నారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించి వారి ఆశయ సాధనకు కృషి చెయ్యాలని అన్నారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కె.వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కె. కాలేషాబాబుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించి మహాత్మాగాంధీకి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆటల పోటీలలో విజేతలైన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు (ఎన్.ఏ)లు సుబ్బయ్య, విక్రమ్ రెడ్డి, వెంకటరావు, స్వరూపరాణి, రాణి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *