దర్శి నియోజక వర్గ అభివృద్ధిలో మాజీ దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పాత్ర మరువలేనిదని వక్తలు కొనియాడారు. చీమకుర్తిలోని ఆయన ఘాట్లో అయన సతీమణి జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఆయన తనయుడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కుటుంబసభ్యులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఘన నివాళి అర్పించారు. ఆయన నివాసంలో చిత్ర పటానికి పూల మాలలు వేసి అభిమానుల సమక్షంలో కేక్ ను కట్ చేసారు. పెద్దాయన బూచేపల్లి సుబ్బారెడ్డి అడుగు జాడలలో నడుస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.
పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ
జెడ్సీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబసభ్యులు కలసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దుస్తులు పంపిణీ చేసారు. అన్నదానం నిర్వహించారు .తాళ్లూరు తేజ వయో వృద్ధాశ్రమంలో వైసీపి జిల్లా సంయుక్త కార్యదర్శి పి. మధుసూధన రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపినీ చేసి అన్నదానం నిర్వహించారు. వైసీపి. రాష్ట్ర విద్యార్ధి విభాగం జోనల్ ప్రసిడెంట్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దర్శి పార్టీ కార్యాలయంలో కేట కట్ చేసి పంచి పెట్టారు.













