హైదరాబాద్ ఆగస్టు 15, జే ఎస్ డి ఎం న్యూస్ :
సైబరాబాద్ కమీషనరేట్ పరధిలోని బాలానగర్ డివిజన్
ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో భారతప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఇండియన్
పోలీస్ మెడల్ కు ఆయన ఎంపికయ్యారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించడం, శాంతిభద్రత పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించినందుకు భారత ప్రభుత్వం ఆయనను ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికచేసింది. అయన గోల్కొండ కోటలో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.నరేష్ రెడ్డి 1991 బ్యాచ్ కి చెందినవారు. ఖమ్మం జిల్లా లోని కూనిజర్ల పోలీస్ స్టేషన్ లో ఆయన ఎస్ఐగా మొదటి పోస్టింగ్ నిర్వహించారు. అనంతరం ఖమ్మం, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమీషనరేట్ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2017 లో పదోన్నతిపై డీఎస్పీగా విధులు నిర్వహించారు. 1999 లో సేవ పతకం, 2013 లో ఉత్తమ సేవా పతకంతో పాటు 2020 లో మహోనత సేవ పతకాన్ని అందుకున్నారు. మే 2025లో ఏసీపీగా పదోన్నతిపై సైబరాబాద్ కమీషనరేట్ పరధిలోని బాలానగర్ కు వచ్చారు. బాలానగర్ ఏసీపీగా భాధ్యతలు చేపట్టిన నాటినుంచి శాంతిభద్రత పరిరక్షణలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడంతో తనకు మరింత
స్ఫూర్తినిచ్చిందన్నారు. తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఉన్నతా అధికారుల ఆదేశాలు, సూచనలతో శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. అవార్డు రావడంపై బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏడీసీపీ సత్యనారాయణ, డివిజన్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఏసీపీకి అభినందనలు తెలిపారు.
