బేగంపేట ఆగస్టు 15 జే ఎస్ డి ఎం న్యూస్ :
నగరాన్ని సుందరంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలంటూ ఒకవైపు ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నప్పటికీ కొందరి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి అమలుకు నోచుకోవడం లేదు.సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రధాన రోడ్ వెంట సైతం ముక్కు మూసుకోకుండా నడవలేని దుస్తితి.సికింద్రాబాద్ నుంచి బేగంపేట మార్గంలో చీఫ్ రేషనింగ్ ప్రధాన కార్యాలయం ముందు నిత్యం పరుగులు పెడుతున్న మురుగుతో పాదచారులు ,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నెలల తరబడి ఇక్కడ డ్రైనేజీ నీరు పారుతున్నా అధికారులు,ప్రజా ప్రతినిధులకు కనిపించక పోవడం విడ్డూరంగా ఉంది.డ్రైనేజ్ నుంచి బయటకు వచ్చిన మురుగు చీఫ్ రేషనింగ్ ప్రధాన కార్యాలయం గేటు ముందు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది.అలాగే కార్యాలయం మరో గేటు వద్ద ఉన్న మ్యాన్ హోల్ నుంచి బయటకు వచ్చిన మురుగు ప్రధాన రోడ్ వెంట పారుతూ సికింద్రాబాద్ అగ్ని మాపక కేంద్రం వరకు పారుతుంది.దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహన దారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మురుగు నీరు బయటకు వచ్చే మ్యాన్ హోల్ పక్కనే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది.మురుగు పొంగి పొర్లుతూ రోడ్ వెంట పారుతుండటం ఆలయానికి వచ్చే భక్తులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాది కారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.



