పేదలు మరణిస్తే మట్టి ఖర్చులు అందిస్తా -ఏపీఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ ఆవుల కృష్ణారెడ్డి -జిల్లా మానవతా సంస్థ కార్యదర్శిగా కపురం ..

పేదలు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల కోసం ఆర్థిక సాయం ఏడాదిపాటు అందిస్తానని ఏపీఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ ఆవుల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పొదిలి లోని దర్శి రోడ్డులో నూతనంగా నిర్మించిన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ భవనాన్ని ఆది వారం ఆయన ప్రారంభించారు. సంస్థ కార్యాలయానికి 150 కుర్చీలు అందజేశారు. అనంతరం భవన నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం అందించిన కృష్ణా రెడ్డి, ఆయన తండ్రి ఓబులక్కపల్లి సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బారెడ్డి, సోదరుడు సంజీవరెడ్డిని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ముందుగా సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మువ్వల పార్థ సారధి, సభ్యులు శ్రావణి వెంక టేశ్వర్లు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, బండి అశోక్, బాజీ కరీముల్లా, వరికూటి శిరీష తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా మానవతా సంస్థ కార్యదర్శిగా కపురం ..

దర్శి మానవతా సేవా సంస్థ కన్వీ నర్ గా పనిచేసి, డైరెక్టర్ గా ఉన్న కపురం శ్రీనివా స్ రెడ్డిని ప్రకాశం జిల్లా మానవత సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న ఎం రామచంద్ర రెడ్డి ప్రకటిం చారు. పొదిలి లోని మానవత స్వచ్ఛంద సేవాసంస్థ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సంస్థ వ్యవస్థాపకుడు ఎన్.రామచంద్రారెడ్డి హాజర య్యారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మానవత స్వచ్చంద సేవాసంస్థ నూతన కార్యవర్గ సభ్యులచే ఆయన ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సేవ చేయాలన్న ఆలోచన బలంగా వుండబట్టే సుధీర్గ రాజకీయాలను సైతం పూర్తిగా వదులుకొని సేవ బాటలో నడిచాలని సేవ చేస్తే ఆత్మ సంతృప్తి ఉంటుందని, మానవుని ఆయుష్ పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మానవతా సంస్థ ప్రతినిధులందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *