బేగంపేట ఆగస్టు 18 జే ఎస్ డి ఎం న్యూస్ :
ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయాలుగా ఉన్న దేవాలయాల అభివృద్ధి కి
తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్ లోని లోధా అపార్ట్మెంట్ వెనుక గల ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ పబ్బా ఆంజనేయ స్వామి, శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయాల పునర్నిర్మాణం పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారిని, స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయనను కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం నమూనాలను ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. ఎమ్మెల్యే వెంట సనత్ నగర్ బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు భూపాల్ రెడ్డి, శివ శంకర్, యాదగిరి, రాజు, పటేల్, నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, రాజేష్ ముదిరాజ్, పీయూష్ గుప్తా, ఫాజిల్, జమీర్, సురేందర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.



