గ్రామ్య సంవృద్ధి గ్రామ్, సంవృద్ధి భారత్ ఇనిషియేషన్ వారు అందించిన గ్రామ ఐకానిక్ అవార్డు – 2025ను తాళ్లూరు మండలం విఠలాపురం వాసి మారం అనంత రెడ్డి అందుకున్నారు. న్యూడిల్లీ డిప్యూటీ స్పీకర్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన అవార్డుల ప్రధానంలో సీఎండీ చైర్మన్, ఎఎన్ ఏ ఆర్ ఈ గ్రామ్య అధ్యక్షుడు డాక్టర్ పంజాబ్ శుక్లా చేతుల మీదుగా ఐకానిక్ -25 అవార్డును అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో అత్యధిక పాల ఉత్పత్తి తో పాటు, దేవాలయాల నిర్మాణానికి, సాంస్కృతిక సంరక్షణ మరియు గో సేవ కు ఆయన చేసిన అసాధారణ కృషికి, అంకిత భావంకు, ప్రభాత వంతమైన సేవకు గాను ఈ గ్రామ్య ఐకానిక్ అవార్డు అందుకున్నారు. న్యూడిల్లీ లో అవార్డు అందుకున్న అనంత రెడ్డిని ఆయన బంధు మిత్రులు, తోటి రైతులు అభినందనలు తెలిపారు.

