కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల యొక్క ధ్రువీకరణ పత్రాల పరిశీలన

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా, అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు డీపీఓ సిబ్బంది నిర్వహించారు. ఈ పరిశీలనకు మొత్తం 349 మంది అభ్యర్థులకు గాను 327 మంది హాజరయ్యారు. (సివిల్ -144/153, ఏపీ ఎస్పీ-183/196) అభ్యర్థుల విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రం, స్థానికత సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్ మరియు ఇతర అవసరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థుల వద్ద నుండి మూడు సెట్ల అటెస్టేషన్ పత్రాలను తీసు కోన్నారు.
ఈ సందర్భంగా
జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ …కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి అభ్యర్థి సమర్పించిన పత్రాలను కుణ్ణంగా పరిశీలించటం జరిగిందని, సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్న అభ్యర్థులకే ఉద్యోగం వస్తుందని, ఎవరైనా తప్పుడు పత్రాలు ఉన్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పత్రాల పరిశీలన అనంతరం, అర్హత ఉన్న అభ్యర్థులను తదుపరి నియామక దశకు ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించామని, ఏవైనా సందేహాలు ఉంటే అక్కడికక్కడే నివృత్తి చేశామన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో ఏఎఓ పి ఈ విజయ కుమార్, ఆర్ ఐ లు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, డీపీఓ సూపరింటెండెంట్ లు సంధానిబాషా, డి.శైలజ మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *