ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి నాణ్యతతో సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
జిల్లా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా అధికారులు, పిజిఆర్ఎస్ ఆడిట్ టీమ్ అధికారులతో సమావేశమై శాఖల వారీగా పిజిఆర్ఎస్ పై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని అన్నారు. పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారులకు నిర్ణీత గడువు లోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీ రాజ్, ఎడ్యుకేషన్, సిపిడిసిఎల్, మునిసిపల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, దేవాదాయ తదితర శాఖలకు సంబంధించి ప్రజల నుండి వివిధ సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి నాణ్యతతో సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిష్కరించిన అర్జీలు తిరిగి రీ ఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు కరెక్ట్ ఎండార్స్మెంట్ ఇచ్చారా లేదా అని, అర్జీదారులు సంతృప్తి చెందారా లేదా అని ఆడిట్ టీమ్ కచ్చితంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్, ఆడిట్ టీమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలకు సంబంధించి 47,200 ఆర్జీలను పరిష్కరించగా, 42,487 ఆర్జీలను ఆడిట్ చేయడం జరిగిందని, అలాగే, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలకు సంబంధించి 16,834 ఆర్జీలను పరిష్కరించగా, 16,796 ఆర్జీలను ఆడిట్ చేయడం జరిగిందని, అలాగే రీ సర్వే కు సంబంధించి గ్రామ సభల్లో వచ్చిన అర్జీలకు సంబంధించి 8,624 ఆర్జీలను పరిష్కరించగా, 8,609 ఆర్జీలను ఆడిట్ చేయడం జరిగిందని పిజిఆర్ఎస్ నోడల్ అధికారి పివిఎస్పి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కు వివరించారు. డివిజన్ వారిగా ఏర్పాటుచేసిన ఆడిట్ టీంచే పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, నోడల్ అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీ గౌస్ భాషా, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శ్రీ పానకాల రావు, డిసిహెచ్ఎస్ డా. శ్రీనివాస నాయక్, కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సెక్షన్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

