బేగంపేట నవంబర్ 3 (జే ఎస్ డి ఎం న్యూస్)
బేగంపేట్ డివిజన్ పరిధిలోని శ్యాంలాల్ బిల్డింగ్ తాతాచారి కాలనీ వీధి నెంబర్ వన్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రహరీ ఆనుకొని ఉన్న చెట్టు తమ ఇండ్లపైకి వాలిపోవడంతో తమ ఇళ్ళలోకి పాములు వస్తున్నాయి అంటే స్థానికులు వాపోయారు. ఈ సమస్యపై స్పందించిన అధికారులు చెట్ల కొమ్మలను కొట్టివేయడంతో సమస్య పరిష్కారమైంది దీంతో సైనికులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
