తాళ్లూరు మండలంలో ఉత్సాహంగా సంక్రాంతి, కనుమలు నిర్వహణ

మండలంలో గురు, శుక్ర వారాలు సంక్రాంతి కనుమలు ఉత్సాహంగా పండుగను ప్రజలు నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాలలో పెద్ద ఎత్తున పలు పోటీలు నిర్వహించారు. పెద్ద పండుగ సంక్రాంతి రోజున తూర్పుగంగవరంలో తూర్పు గంగవరం అభివృద్ధి కమిటి, పడమటి బజారు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బొద్దికూరపాడులో పోలం రెడ్డి చిన వీరా రెడ్డి, లక్ష్మీ నరసమ్మ ల జ్ఞాపకార్థం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో షటిల్ బ్యాట్మెంటన్ పోటీలు, స్లో బైక్లెస్ పోటీలు నిర్వహించారు. లక్కవరంలో బూచేపల్లి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో, టిడిపి ఆధ్వర్యంలో ప్రత్యేక కోలాట ప్రదర్శన నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరులో ఉత్సాహంగా కోడి పందేలు నిర్వహణ….

తాళ్లూరులో కోడి పందేలు పండుగ మూడు రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించారు. పండుగ సంస్కృతిలో బాగం నిర్వహించిన కోడి పందేలకు ప్రజల అధిక సంఖ్యలో తరలి రావటంతో తిరునాళ్ల వలే నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా కోడి పందేలను చూడాలంటే ఉభయ గోదావరి జిల్లాలకు తరలి వెళ్ల వలసి వచ్చేది. అవే ఏర్పాట్లు ఇక్కడ ఉండటంతో మహిళలు కూడ అధిక సంఖ్యలో తరలి వచ్చి చూడ టానికి ఇష్టపడ్డారు. అధిక సంఖ్యలో పందేలు కూడ కాయటంతో మహిళలు ఉత్సాహం వెల్లివిరిసింది. కోడి పందేలు మంచి వినోదభరితంగా ఉండటవంతో మంచి అవకాశం కల్పించిన నిర్వాహకులను ప్రజలు అభినందించారు. ప్రొత్సహం అందించిన కూటమి ప్రభుత్వానికి, నాయకులు ధన్యవాదాలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *