వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని తాళ్లూరు ఎస్సై ఎస్. మల్లికార్జునరావు కోరారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని చెప్పారు. సైబర్ ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
