ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారఅంజయ్య కుటుంబం ప్రొత్సాహక బహుమతులు అందించటం అభినందనీయమని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య అన్నారు. తాళ్లూరులో శుక్రవారం ఉత్తమ మార్కులు సాధించిన వికే ఉన్నత పాఠశాల విద్యార్థులకు, ప్రత్యేకంగా ఎబీసీ ఉన్నత పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థితో కలిపి ఐదుగురు విద్యార్థులకు ప్రొత్సాహక బహుమతులను జిల్లా మాల వహానాడు జిల్లా అధ్యక్షుడు దార అంజయ్య, ఆయన కుమార్తె సోని ప్రియా దాతృత్వంతో అందించారు. కార్యక్రమానికి ఎంఈఓ జి సుబ్బయ్య, హెచ్ఎం మిల్టన్, ఎంఆర్పీఎన్ నాయకుడు అనపర్తి ఆదాం , డి బి ఆర్ సి జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు బంటుపల్లి అఖిల్ వర్మ, వేమాకీర్తన, కొత్త జెస్సీ, మేకల బ్యూలా, చుక్క తనుష్లను శాలువాతో సన్మానించి ఆర్థిక ప్రొత్సహం, బహుమలు అందించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను ఎంఈఓ జి నుబ్బయ్య, వక్తలు వివరించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.


