సీనియర్ నాయకుడు వెంకట రామి రెడ్డి సేవలు మరువలేనివి

ఉల్లగల్లు పంచాయతీ లక్ష్మీ నగర్ వైసిపి సీనియర్ నాయకుడు తూము వెంకట రామి రెడ్డి సేవలు పార్టీ మరువలేనివి , మంచి మానవతా వాది అని వైసీపి జిల్లా అధ్యక్షులు , దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచే పల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.ముండ్లమూరు మండలం లక్ష్మీ నగర్ లో తూము వెంకట రామి రెడ్డి దశదినకర్మకు హాజరై
ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘ రాజకీయ క్రియా కీలక కార్యకర్తగా ఆయన పార్టీకి చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకున్నారు. ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి,వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు చింతా శ్రీనివాస రెడ్డి, జడ్పిటిసి రత్నరాజు,పార్టీ జిల్లా కార్యదర్శి మారం ఇంద్రసేనారెడ్డి, అన్నపురెడ్డి బిక్షాల్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి లోకి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సిద్ధ మూర్తి నరసింహారెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యదర్శి ఎడమ కంటి వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *