తెలంగాణలో బిజెపిని పటిష్టం చేస్తా-తెలంగాణ రాష్ట్ర బిజెపి గిరిజన మోర్చా కార్యదర్శి మునావత్ పాండు నాయక్

హైదరాబాద్ , జూన్‌ 22:(జె ఎస్ డి ఎం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర నలుమూలల గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మునావత్ పాండు నాయక్ పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు తాను రౌండ్ ద క్లాక్ పద్ధతిలో వారికి అందుబాటులో ఉంటన్నారు.బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శిగా ఇటీవలనే నూతనంగా నియమితులైన మునావత్ పాండు నాయక్ మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ …రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గిరిజన తండాల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు… కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గిరిజనులందరికి అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు… తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం అన్నారు ..బిజెపి అధికారంలోకి రావడం 100% ఖాయమని మునావత్ పాండు నాయక్ వెల్లడించారు… ..గత అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం నెరవేర్చలేదన్నారు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు ..యువత ..మహిళలు అన్ని రంగాల ప్రజలు నానా ఇక్కట్ల పాలవుతూ నరకం తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు… నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం ఎక్కడ పోయిందని మునావత్ పాండు నాయక్ ప్రశ్నించారు… రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలలో రోడ్ల నిర్మాణాలు ఇతర మౌలిక వసతులు వెంటనే కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునవత్ పాండు నాయక్ డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *