నాగులుప్పలపాడు,జూన్ 22, ఉప్పుగుండూరు గ్రామపంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు కొంజేటి.జలంధర్, పెంట్యాల శ్రీనివాసరావు లు సంయుక్తంగా సోమవారం దుస్తులను వారికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు సేవ చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మన గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు వాళ్ళు నిరంతరంగా పాటు పడుతున్నారని ఆ కుటుంబాలకు చేయూతనందించటం మనందరి బాధ్యతని వారు తెలియజేశారు. సామాజిక సేవకుడు కొంజేటి.జలంధర్ ఆధ్వర్యంలో 15 వేల రూపాయలు విలువ గలిగిన దుస్తులను పారిశుద్ధ్య కార్మికులకు మహిళలకు చీరలను , పురుషులకు ప్యాంటు షర్టులను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి సూర్యనారాయణ ,టిడిపి నాయకులు బెల్లం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు .

