పీవీ నరసింహారావు జయంతి వేడుకలు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

బేగంపేట జూన్ 28, (జే ఎస్ డి ఎం న్యూస్) :
దేశ గమనాన్ని మార్చిన సంస్కర్త, భారతరత్న,దివంగతప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విశాల్ సుధాం అన్నారు పి.వి జయంతి వేడుకలను బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానంద తీర్థా లో కాంగ్రెస్ శ్రేణులు పి.వి.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తెలంగాణ ముద్దుబిడ్డగా, దేశం గర్వించదగ్గ అరుదైన బహుభాషా కోవిదుడిగా పీ.వీ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విశాల్ సుదామ్ మాట్లాడుతూ, పీవీ నరసింహారావు ఒక నాయకుడు మాత్రమే కాదని, ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసిన దార్శనికుడని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు దేశ రూపురేఖలను మార్చడమే కాకుండా, నేటి తరాల ప్రగతికి బాటలు వేశాయని స్పష్టం చేశారు. పీవీ చూపిన దేశ సేవ, ఐక్యత, సమ్మిళిత అభివృద్ధి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు నశీర్ అడ్డు, సీనియర్ నాయకులు సి. రాజేందర్, దేవేందర్, ప్రసన్న, ఇలియాస్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పీవీ నరసింహారావు దేశానికి చేసిన అసమాన సేవలు భారత చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన ఆశయాల సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కట్టుబడి ఉంటాయని నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *