తాళ్లూరు మండలంలోని చింతల పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శనివారం ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గత రెండు రోజుల నుండి పలు పూజా కార్యక్రమాలు వేద మత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. వేద పండితులు డాక్టర్ గాజుల పల్లి గౌతమ్ శర్మ, ప్రతి ష్టా చార్యులు రాయప్రోలు తులసీ నాథ్ శర్మ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టా మహెూత్సవానికి బంధు మిత్రుల రాకతో గ్రామం కళ కళ లాడినది.
