చింతలపాలెం గ్రామంలో రామాలయ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ప్రారంభం

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో నూతనంగా ప్రతిష్టించనున్న నూతన రామాలయ ప్రతిష్ట కార్యక్రమం వేడుకలు గురువారం ఉదయం 9 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం మొదటి రోజు గురువారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవచనం , రక్షాబంధన, దీక్ష ధారణ , రుత్విక్ వరుణ ప్రవేశం, ప్రధాన కలశ స్థాపన, వాస్తు చతుర్ షష్టి యోగిని సర్వతోభద్ర మండల దేవత వాహన అంకురార్పణ , అగ్ని మదన, మూల మంత్ర హోమ దీక్ష హోమం, జలాధివాస చతుర్వేద పూర్వక దర్బారు సేవ కార్యక్రమాలు జరిగాయి. మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి లక్ష్మి పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. కార్యక్రమం గ్రామ పురోహితులు డాక్టర్ గాజులపల్లి గౌతమ్ శర్మ, రాయప్రోలు తులసినాధ శర్మ వేద పండితులు , గ్రామ పెద్దలు , మహిళల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తాళ్లూరు మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, లేళ్ళ వెంకయ్య, హరిబాబు, సూరారెడ్డి గ్రామ టిడిపి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *