బేగంపేట ట్రాఫిక్ ఏ ఎస్సై శ్యామలకు ‘అంబాసిడర్ ఆఫ్ స్పోర్ట్స్’ అవార్డు ప్రధానం

హైదరాబాద్ జూన్ 27,(జే ఎస్ డి ఎంన్యూస్) :
బేగంపేట్ ట్రాఫిక్ ఏఎస్ఐ డాక్టర్ వి. శ్యామలకు ప్రతిష్టాత్మక ,,అంబాసిడర్ ఆఫ్ స్పోర్ట్స్,,అవార్డ్ అందుకున్నారు.
దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించిన క్రీడా దిగ్గజాలకు అందించేప్రతిష్టాత్మకమైన ‘అంబాసిడర్ ఆఫ్ స్పోర్ట్స్’ అవార్డుల ప్రదానోత్సవం శనివారం ఘనంగా జరిగింది.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ పురస్కారాల ప్రధానోత్సవంలో బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) డాక్టర్ వి. శ్యామల
ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. అథ్లెటిక్స్, షాట్‌పుట్, డిస్కస్ త్రో తో పాటు వెపన్ షూటింగ్‌ విభాగాల్లో రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ స్థాయిలలో ఏకంగా 63 మెడల్స్ సాధించి దేశ కీర్తిని ప్రతిబింబించినందుకు గాను ఆమెకు ఈ అత్యున్నత గౌరవం దక్కింది.ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కమిటీ సెక్రటరీ డాక్టర్ వై. రామారావు నేతృత్వంలో నిర్వహించారు. స్పోర్ట్స్ రంగంలో విశేష సేవలందించిన క్రీడా ప్రముఖులు శివసేనారెడ్డి, కే. రామ్ రెడ్డి, బి. లక్ష్మణ్, ఏ. శ్రీధర్ తదితరుల చేతుల మీదుగా శ్యామలకు పురస్కారాన్నీ అందజేశారు. పోలీసు శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే, క్రీడల పట్ల అంకితభావంతో ఎన్నో పతకాలు సాధించిన ఏఎస్ఐ డాక్టర్ వి. శ్యామలను ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *