ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట్‌లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా….750 కోట్ల విలువ ఉంటుందని అంచనా…హస్మత్ పేట సర్వే నెంబర్ 1 లో 108 ఎకరాల స్థలం ఉండగా 98ఎకరాలు కబ్జా…10ఎకరాలలో ఉన్న ప్రీ కాస్ట్ కాంపౌండ్ ,తాత్కాలిక షెడ్ల తొలగించిన హైడ్రా…హైడ్రా ఉక్కుపాదం.రెవెన్యూ అధికారుల లేఖ మేరకు హైడ్రా చర్యలు.

బోయినపల్లి జూన్ 26 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట్‌లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ని హైడ్రా అధికారులు కాపాడారు.హైడ్రా కాపాడిన భూమి విలువ సుమారు 750 కోట్ల విలువ ఉంటుందని అంచనా.ఓల్డ్ బోయిన్ పల్లి హస్మత్ పేట సర్వే నెంబర్ 1 లో మొత్తం 108 ఎకరాల స్థలం ఉండగా 98ఎకరాలు ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలతో కబ్జా కు గురైంది.నివాసాలు ఉంటున్న ఇళ్ల జోలికి పోకుండా10ఎకరాలలో ఉన్న ప్రీ కాస్ట్ కాంపౌండ్ ఏర్పాటు చేసుకుని సొంత మనుషులను కాపలా గా ఉంచి న స్థలంలో ,తాత్కాలిక షెడ్ల ను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు.రెవెన్యూ అధికారుల లేఖ మేరకు హైడ్రా ఈ చర్యలకు ఉపక్రమించింది.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్ సర్వే నెంబర్ 1 చత్రిగడ్డలో హైడ్రా (HYDRAA) అధికారులు భారీ స్థాయిలోకూల్చివేతలు చేపట్టారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన విలువైన భూమిని కొందరుఅక్రమార్కులు కబ్జా చేసి, యథేచ్ఛగా నిర్మాణాలుచేపడుతున్నట్లు అధికారులకు పెద్ద ఎత్తున
ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాయి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ అధికారులు జేసీబీల సహాయంతో నిర్మాణాలను నేలమట్టం చేశారు. దాదాపు 10ఎకరాలకు పైగా ఉన్న ఈప్రభుత్వ భూమిని ఆక్రమించిన కొందరు కేటుగాళ్లు, నోటరీ ప్లాట్ల పేరుతో అమాయక ప్రజలకు విక్రయాలు చేస్తున్నట్లు అధికారులుగుర్తించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సదరు భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో స్వాధీనంచేసుకోనున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని
ఈ సందర్భంగా అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.కూల్చివేతల సందర్భంగా మల్కాజ్ గిరి సి పి బి సుమతి ,డిసిపి శ్రీధర్ నేతృత్వంలో బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో అల్వాల్ పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *