తాళ్లూరు మండలంలోని శివరాంపురం వీఆర్వో
పమిడిఘంటం చంద్రశేఖరరావు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇచ్చి చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ చేస్తూ డీఆర్వో పి.వెంకటరమణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో చంద్రశే ఖర్ రావు ప్రస్తుతం నాగంబొట్లపాలెం ఇంచార్జి వీఆర్వోగా ఉన్నారు. విఆర్ఓ గా సర్వీస్ లో ఎక్కువ భాగం తాళ్లూరు మండలంలోనే పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయానికి సీనియర్ అసిస్టెంట్ వెళ్లారు.
ఓట్ల సమగ్ర విచారణ ప్రొగ్రాం ( సర్ ) నిర్వహణలో బీఎల్ ఓ గా ఉన్నందున చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో చేరి తదుపరి ఈ కార్యక్రమం ముగిసే వరకు తాళ్లూరు మండలంలోనే విధులు నిర్వహించాలని డీఆర్వో ఆ ఉత్తర్వుల్లో కోరారు.