చట్టాలపై అవగాహన కలిగి కల్పించాలి -తాళ్లూరు ఎస్. ఐ మల్లికార్జునరావు

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తాళ్లూరు ఎస్. ఐ మల్లికార్జునరావు పేర్కొన్నారు.
తూర్పు గంగవరంలో సోమవారం నేరాలు, చట్టాలు, ఆన్ లైన్ మోసాలుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ…. ఆరుబయట నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒంటిపై విలువైన వస్తువులు ధరించి బయట నిద్రించరాదని, మీ విలువైన వస్తువులను ఇంట్లో భద్రపరచుకోవాలన్నారు. ప్రయాణ సమయాల్లో మహిళలపై అసభ్యం ప్రవర్తించిన వారిపై ఫిర్యాదు చేయాలన్నారు.గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదం తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఆన్ లైన్ ద్వారా జరుగు మోసాలు, రోడ్డు ప్రమాదాలపైఅవగాహన కల్పించారు. మాలకొండయ్య, రాములు, అంజి బాబు , వాసు , సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *