కాకినాడకు చెందిన కాపు యువతి మత్స గంగభవాని కనిగిరి కి చెందిన మాదిగ యువకుడు పరిశపోగు రాహుల్ కులాంతర వివాహ వేడుక ఒంగోలులో దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు . కాకినాడ జిల్లా , శానికవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన కాపు కుల యువతి మత్స గంగభవాని గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో డిప్లమో ఇన్ ఫార్మసీ లో చేరింది. 2022లో అదే కాలేజీలో బి ఫార్మసీ చదవటానికి వెళ్లిన మార్కాపురం జిల్లా కనిగిరి మండలం బల్లి పల్లి గ్రామానికి చెందిన మాదిగ కులానికి చెందిన పరిసిపోవు రాహుల్ కూడా అదే కాలేజీలో డి ఫార్మసీ చేరాడు. కాలేజీలో నాలుగేండ్ల డిప్లమో ఇన్ ఫార్మసీ పూర్తి అయ్యేసరికి వీరిద్దరూ డిప్లమాటిక్ గా ప్రేమించుకున్నారు. తమ కులాలు వేరైనా కలసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కానీ గంగాభవాని తండ్రి కాపు కులానికి చెంది కలప వ్యాపారం చేసే గంగరాజు కుటుంబానికి తన కూతుర్ ను మాదిగ యువకుడికి ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదు. కూతుర్ని కాబోయే అల్లుడ్ని గంగరాజు బంధువులు గంగరాజు తో పాటు అనేకసార్లు బెదిరించారు. గంగాభవానికి తన కులానికి చెందిన మరో యువకుడితో పెళ్లి సంబంధం నిశ్చయించారు. తాను రాహుల్ ని ప్రేమించానని తమ ప్రేమావివాహానికి అడ్డుపడద్దని తమ కులాంతర వివాహాన్ని ఆశీర్వదించాలని గంగాభవాని తన కుటుంబ సభ్యులను అనేకసార్లు ప్రాధేయపడింది. అయితే గంగరాజు కుటుంబం గంగాభవాని నిర్బంధించి బలవంతంగా పెళ్లి చేయాలని కాపు కాశారు. చాక శక్యంగా ఇంటిలో నుండి తప్పించుకొని కాకినాడ నుండి తాను ప్రేమించిన రాహుల్ కోసం గంగాభవాని కనిగిరి మాదిగ పల్లికి చేరుకుంది. తర్వాత ఒంగోలు అంబేద్కర్ భవన్లో గత నెల 27 వ తారీఖున వీరిద్దరి కులాంతర వివాహం చేసుకున్నారు. కుల కక్షతో కూటమి ప్రభుత్వ అండతో రెచ్చిపోయిన గంగరాజు తన 24 సంవత్సరాల వయసు కలిగిన మేజర్ అయిన గంగాభవాని తదితరులపై పోలీసు కేసు పెట్టారు. కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని కులాంతర వివాహ జంట గంగా భవాని రాహుల్ దళిత నేత నీలం ఆశ్రయించారు. అంతట ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం గంగాభవాని రాహుల్ల కులాంతర వివాహ వేడుక నీలం నాగేందర్ నిర్వహించారు. అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబును ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కలిసి కులాంతర వివాహ జంటకు చట్ట ప్రకారం రక్షణ కల్పించి వధువు తరుపు కాపు బంధువులను బైండోవర్ చేయించవలసినదిగా ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ను కలసిన వారిలో పివి రావు మాల మహానాడు అధ్యక్షుడు ధారా అంజయ్య, మాదిగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పట్రా బంగారం, మాలసభ కన్వీనర్ మేడికొండ మురళి, సమతా వేదిక కన్వీనర్ ఏలూరు శ్రీనివాసరావు, ఏపీ డి ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు గొంటె గాని పేతురు తదితరులు ఉన్నారు.
