ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. కారుణ్య కోటాలో ఉద్యోగాలు పొందిన ఏడుగురికి సోమవారం గ్రీవెన్స్ హాలులో ఆయన నియామకపత్రాలను అందించారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినందున విధులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పట్ల అవగాహన పెంచుకుని మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, డిఆర్ఓ పి.వెంకటరమణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
