జిల్లాలో సాధారణం కంటే అధికంగా యూరియా అమ్మకాలు జరిపిన దుకాణాలపై
అద్దంకి సహాయ సంచాలకులు (ఏడీఏ) బి ఎఫ్రాయిమ్ అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తూర్పుగంగవరం, లక్కవరం, బొద్దికూరపాడు ల లోని ఎరువుల దుకాణాలలో తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ లు, రసీదులు, ఈ పాస్ మిషన్ వివరాలు సక్రమంగా ఉన్నవా లేవా మరియు రైతుల వినియోగం పై పరిశీలించారు. ఎరువుల అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్లయితే యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎడీఏ హెచ్చరించారు.
వ్యవసాయాధికారి ప్రసాద రావు, టెక్నికల్ ఎవో టి వెంకటేశ్వర్లు, ఎఈఓ సుబ్బా రెడ్డి, ఎటీఎం ఆత్మ రామి రెడ్ది పాల్గొన్నారు.

