తాళ్లూరు మండలంలోని శివరామపురం పంచాయితీ పరిధిలో మంగళవారం ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్ ఇన్చార్జి నారిపెద్ది కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు వి శ్రీనివాస రావు, బూత్ ఇన్చార్జి ఎన్ శింగయ్య పాల్గొని ఇంటింటికి తిరిగి పార్టీ ఆద్వర్యంలో అమలు అవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు .
