క్షయను ప్రారంభ దశ లో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. మన్నేపల్లిలో గురువారం సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (నమర) ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో బాగంగా ఛాతి పరీక్షలు నిర్వహంచి ఎక్స్ రే ను తీయించారు. డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు. 105 మందికి ఛాతి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. కార్యక్రమంలో సీహెచ్ మంగా బాయి, టిబి హెచ్ వీ సాయి ప్రసాద్ హేల్త్ సూపర్ వైజర్ పివి రవి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

