తాళ్లూరు మండలం విఠలాపురంలో వేంచేసి ఉన్న మారం వారి అంకమ్మ తల్లి దేవాలయ 4 వ వార్షికోత్సవ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంకమ్మ తల్లిని మారం వారితో పాటు పలువురు ప్రముఖులు సందర్శించుని మొక్కులు తీర్చుకున్నారు. చీమకుర్తికి చెందిన ట్రిపుల్ హెట్రిక్ మాజీ ఎఎంసీ చైర్మన్ మారం వెంకట రెడ్ది, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైసీపి జిల్లా కార్యదర్శి, మాజీ నర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి, మారం సుందరామి రెడ్డి , మాజీ వైస్ ఏం. పి. పి శ్రీనివాస రెడ్డి లతో పాటు పలువురు ప్రముఖలు హాజరైనారు. వార్షికోత్సవ సందర్భంగా బంధు మిత్రుల రాకతో విఠలాపురం కళ కళ లాడినది.

