సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, వెంటనే రాజీ నామా చేయాలని, డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ దర్శి పట్టణం లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయ కులు, నిరుద్యోగులు పట్టణం దద్దరిల్లేలా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం గడి యారం స్తంభం సెంటర్కు చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. వై సీపీ జిల్లా అధ్య క్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృ తి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చావా చంద్రబాబు.. అని ఎమ్మెల్యే బూచేపల్లి ప్రశ్నించారు. ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి ఇచ్చావా.. చంద్రబాబు అని నిలదీశారు. ఒక్కో నిరుద్యోగికి రూ.75 వేల నిరుద్యోగ భృతి బాకీ పడ్డారన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు..ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ వర్గా లను మోసం చేసిన కూటమి సర్కార్ కు ఒక్క
నిమిషమైనా పాలించే అర్హత లేదన్నారు. డీఎస్సీలో అవకతవకలను ఎత్తి చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటే సీబీఐ విచారణ చేయిం చుకుని నిజం నిగ్గు తేల్చాల్సిన చంద్రబాబు, విచా రణ జరిగితే ఆయన ముద్దుల కొడుకు లోకేష్ ఎక్కడ జైలుకు వెళ్తాడోనని వెన్నులో వణుకు పుడు తోందని ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని, చంద్రబాబు, లోకేష్ లు వెంటనే రాజీనామా చేసి దిగిపోవాలని డాక్టర్ మాదాసి వెంకయ్య డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ బూచే పల్లి వెంకాయమ్మ ప్రభుత్వ చర్యలను తూర్పారబట్టారు. కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు, ముండ్ల మూరు, దొనకొండ, కురిచేడు మండలాల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, టి. వి సుబ్బారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధు సూదన్ రెడ్డి,రాష్ట్ర మేదావుల సంఘ ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి సానికొమ్ము తిరుపతిరెడ్డి,
విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గిరెడ్డి నారా యణరెడ్డి, ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానంద రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ్ భాస్కర్, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, సర్పంచ్ ల సంఘ మాజీ అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి, మారం ఇంద్రసే నారెడ్డి, వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, నాగిరెడ్డి, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, గోళ్లపాటి మోషే, మాజీ సర్పంచ్ లు షేక్ వలి, చార్లెస్, మురళి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బచ్చా, ఎంపీటీసీ ప్రభుదాసు, సొసైటీ మాజీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచ్ పులి కృష్ణారెడ్డి, బ్రహ్మరెడ్డి, చిమటా సుబ్బా రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సూదిదేవర అంజయ్య, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ అమీనాబాషా, జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి సంగు కొండారెడ్డి, యూత్ అధ్యక్షుడు
కొర్రపాటి విష్ణు, బీఎల్ఎల నేత అజయ్ రమణ, ఎనుముల శ్రీనివాస రెడ్డి, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గోపు శ్రీనివాసరెడ్డి, యాడిక యలమందారెడ్డి, కుమ్మిత నాగిరెడ్డి, రైతు సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, యూత్ అధ్యక్షుడు దుగ్గినేని రామకృష్ణ, బిజ్జం కృష్ణారెడ్డి, పేరం తిరుపతిరెడ్డి, బీసీ సెల్ నాయకులు అన్నవరపు రవి, చెరుకూరి జగన్, అంకాల శ్రీను, నాయకులు గుజ్జుల వెంకటేశ్వరరెడ్డి, గుజ్జుల కష్ణారెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, దేవదానం, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, డగ్లస్, కోరే సుబ్బారావు, అప్పిరెడ్డి, భిక్షాలురెడ్డి, రామ్మోహన్, కుంటా అచ్చారావు, బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, పానుగంటి కోటేశ్వరరావు, నరసింహారెడ్డి పాల్గొన్నారు.




