బేగంపేట ఆగస్ట్ 11 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మారు బోనం కార్యక్రమం మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ బోనాల జాతర నిర్వహించిన తరువాత పండుగ ముగింపుగా కృతజ్ఞతగా ఆలయ సిబ్బంది అమ్మవారికి మారు బోనం సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం మెక్లోడ్ గూడ మున్నూరు కాపు సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరై బోనాలకు పూజలు నిర్వహించారు. అనంతరం డోలు వాయిద్యాల నడుమ జోగినిలు దేవాలయ సిబ్బందితో కలిసి బోనాలను నెత్తిన పెట్టుకుని మున్నూరు కాపు సంఘం నుండి ఉజ్జయినీ మహాకాళి దేవాలయం వరకు వారితో కలిసి వచ్చి అమ్మవారికి బోనంసమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమీషనర్ హన్మంతరావు, ఆర్జెసి రామకృష్ణ, సహాయ కమీషనర్, ఆలయ కార్యనిర్వాహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి, సికింద్రాబాద్ అడిషనల్ డిసిపి నరసయ్య మహంకాళి ఏసీపీ శ్రీధర్, ఇన్‌స్పెక్టర్ లు రవికుమార్, సురేష్. ఆలయ ధర్మకర్తలు దక్కన్ మానవ సేవ సమితి సభ్యులు కిషోర్ కుమార్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, జోగినిలు నిషా క్రాంతి టీం, డోలినిలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.




