రామ్ గోపాల్ పేట ఆగస్టు 12 (జే ఎస్ డి ఎం న్యూస్)
రాంగోపాల్‌పేట్ డివిజన్లోని ఆదయ్య మెమోరియల్ హైస్కూల్, రాణిగంజ్ ఓల్డ్ గ్యాస్ మండిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా దాదాపు 100 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా త్రికాల మనోజ్ కుమార్ మాట్లాడుతూ. మహిళలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వంటి
కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సి.ఎం.రేవంత్ రెడ్డి కి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో : లావణ్య కాంగ్రెస్ నాయకులు : పెరమల చందు , హేమంత్ సింగ్ ఠాకూర్ , మహేష్ , హర్షిత్ , రాజు , వినీల్ , బాబు గౌడ్ , నవీన్ , కార్యక్రమంలో పాల్గొన్నారు .
