హైదరాబాద్ ఆగస్టు 14 ,
(జే ఎస్ డి ఎం న్యూస్ )
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్నిపురస్కరించుకుని ఈ నెల 15న (శనివారం) సాయంత్రం 6.00 గంటలకు రాజ్ భవన్ (లోక్ భవన్) లో తెలంగాణ గవర్నర్ ‘ఎట్ హోమ్’ (At Home) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు (VIPs), సీనియర్ ప్రభుత్వ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఇతర ఆహ్వానితులు పెద్ద సంఖ్యలోహాజరుకానున్నారుఈ నేపథ్యంలో రాజ్ భవన్ రోడ్డులో సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, పలు ట్రాఫిక్ ఆంక్షలు మరియు పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీ. జోయల్ డేవిస్, వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపు వివరాలు రద్దీ ఉండే మార్గాలు మొనప్ప ఐలాండ్ నుండి వి.వి. విగ్రహం జంక్షన్ (ఖైరతాబాద్) వరకు ఉన్న రాజ్ భవన్ రోడ్డుకు రెండు వైపులా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
• ప్రత్యామ్నాయ మార్గాలు: సాధారణ ప్రజలు మరియు వాహనదారులు సాయంత్రం 18:00 గంటల నుండి రాత్రి 20:00 గంటల మధ్య ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
రాజ్ భవన్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు.బ్రౌన్ కలర్ పాస్ (Brown Pass) వాహనాలు:o ఈ పాస్ ఉన్న వాహనాలు రాజ్ భవన్ గేట్ నెంబర్-1 ద్వారా లోపలికి ప్రవేశించి, తమకు కేటాయించిన నిర్ణీత పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలపాలి.
o కార్యక్రమం ముగిసిన అనంతరం గేట్ నెంబర్-2 ద్వారా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. బ్లూ కలర్ పాస్ (Blue Pass) వాహనాలు:
o ఈ పాస్ కలిగిన
వాహనాలు రాజ్ భవన్ గేట్ నెంబర్-3 ద్వారా లోపలికి ప్రవేశించి, గవర్నర్స్ సెక్రటరీ (G.S) గేట్ ద్వారాబయటకు నిష్క్రమించాలి.o ఈ వాహనదారులు తమ వాహనాలను రాజ్ భవన్ క్వార్టర్స్ బై-లేన్, సంస్కృతి కమ్యూనిటీ హాల్, రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల, రాజ్ భవన్ క్వార్టర్స్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, రాజ్ భవన్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్, మెట్రో రెసిడెన్సీ నుండి నాసర్ (NASR) స్కూల్ వరకు ఉన్న సింగిల్-లేన్ పార్కింగ్, ఎంఎంటిఎస్ పార్కింగ్ స్థలం మరియు స్కై సిటీ బిల్డింగ్ పార్కింగ్ ప్రాంతాలలో నిలపాలన్నారు.వాహనదారులందరూ ఈమళ్లింపులను గమనించి, పోలీసులకు సహకరించాల్సిందిగా కోరడమైనది. లైవ్ ట్రాఫిక్ అప్డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఫేస్బుక్ పేజీ (facebook.com/HYDTP) లేదా ఎక్స్ (ట్విట్టర్) ఖాతా (@HYDP) ను పరిశీలించవచ్చు. అత్యవసర ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించవచ్చు అని పోలీసులు తెలియ జేశారు.

