తాళ్లూరు మండలంలో ఘనంగా పంద్రాగష్టు వేడుకలు

తాళ్లూరు మండలంలో పలు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో, 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద, తహసీల్దార్ కార్యాలయం ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, తాళ్లూరు నచివాలయం వద్ద వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ మల్లిఖార్జున రావు జెండాలను ఎగుర వేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు, స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. నేటి లక్ష్యాలను చేరుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని కోరారు. సొసైటీ చైర్మన్లు గొంది రమణా రెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస రావు, డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర ఎంఈఓ -1 జి నుబ్బయ్య, ఎంఈఓ -2 నుధాకర్ రావు, హౌసింగ్ ఎఈ హనుమంత రావు, ఆరిఐ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరులో వికే ప్రభుత్వ జూనియర్ కశాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేణుగోపాల్, వికే ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం మిల్టన్, కస్తూరిబాలో ప్రిన్సిపాల్ నుజిత తూర్పుగంగవరం జెడ్బీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం వైఎన్ ఆర్కే ప్రసాద్, బొద్దికూరపాడు హెచ్ఎం బ్రహ్మయ్య, శ్రీ సరస్వతి హైస్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణా రెడ్డి, ఎబీసీ హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రావు, గీతాంజలి, జాహ్నవి, ప్రగతి, గంగా, శారద, అమెరికల్ పబ్లిక్ పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగుర వేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, నందేశం అందించారు. ఆట పాటల పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *