తాళ్లూరు: మండలంలోని పలుశాఖల అధికారులకు ఉత్తమ సేవలకు గాను స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా పురష్కారాలు అందుకున్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ రాజా బాబు చేతుల మీదుగా వారు పురష్కారాలను అందుకున్నారు. తహసీల్దార్ బివి రమణా రావు, డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర, విఆర్డిఓ నాగూర్ బి, విద్యుత్ శాఖ ఎల్ ఐ కాంతా రావు, ఐకేపీ ఎంఎం ఎస్ అధ్యక్షురాలు సుజాత, ఎపీఎం దేవరాజ్, సీసి కోటేశ్వర రావు, నీ సి ఓ కుమారి, డిబిఆర్సీ నాగమణి, ప్రకృతి సాగు నోడల్ అధికారి వి నాగేశ్వర రావు లు ప్రశంశా పత్రాలు అందుకున్నారు. వారిని ఆయా శాఖల అధికారులు సిబ్బంది, బంధు మిత్రులు అభినందించారు.




