గోశాలలోని గోవులను ఎల్నిలో ప్రభావంతో మేత కొరత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కాపాడతామని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రవి అన్నారు. గోశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఎల్ నినో ప్రభావంతో గోశాల మార్పుతో పచ్చి ఎండు మేత కొంత కొరత ఏర్పడిందని గోశాల సంరక్షకుడు నాగేంద్ర అధికారులకు వివరించారు. పశుసంవర్థక శాఖ ద్వారా టీ ఎం ఆర్ దాణా అందిస్తామని చెప్పారు. టిడిపి నాయకుడు, రైతు కైపు రామకోటి రెడ్డి తన పొలంలో మొక్కజొన్న ఎండిపోయి ఉందని ఆ మేతకు గోశాలకు తోలిస్తానని హామీ ఇచ్చారు. లోకిరెడ్డి నాగి రెడ్డి, తూము నాగేంద్ర ప్రసాద్ రెడ్డిలు కూడ తమ వద్ద ఉన్న కొంత మేతకు నమకూరుస్తామని చెప్పారు. దీంతో మండలంలోని దాతల సహాకారం కూడ తీసుకుని గోవుల రక్షణ చేస్తామని చెప్పారు. ఒంగోలు ఉప సంచాలకులు వెంకట రెడ్ది, మండల పశువైద్యాదికారి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

