పట్టు పరిశ్రమ ఏర్పాటుతో రైతన్నలు ఆర్థిక అభివృద్ధి – సీఎన్ని శాస్త్రవెత్త డాక్టర్ సౌజన్య టి వి

రైతుల ఆదాయం మరియు జీవనోపాధిని పెంపొందించటంలో మల్బరీ ఆధారిత పట్టు పరిశ్రమకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎన్బీ శాస్త్రవేత్త డాక్టర్ సౌజన్య టి వి అన్నారు. కేంద్ర పట్టు పరిశొధన శిక్షనా సంస్థ, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నా పట్టు నా అభిమానం కార్యక్రమంలో బాగంగా నాగంబొట్ల పాలెం గ్రామంలో పట్టు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవెత్త సౌజన్య మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతులతో మల్బరీ సాగు నాణ్యమైన ఆకుల ఉత్పత్తి, పట్టు పురుగుల పెంపకం చేపట్టం ద్వారా రైతులు స్థిర మైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేయువ చేయటం, ఆదాయం, ఉపాధి అవకాశాలు విస్తరించటం నాపట్టు నా అభిమానం 2.0 కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. గుంటూరు పట్టు పరిశ్రమ శాఖాధికారి జి శ్రీనివాస రావు మాట్లాడుతూ మల్చరీ సాగు, పట్టు పరిశ్రమకు అవసరమైన మౌళిక సదుపాయాలల కల్పనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రొత్సహకాలను రైతులు నద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా సహాయ పట్టుపరిశ్రమ శాఖాధికారి పాండురంగ స్వామి, తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *