సీఎం ప్రజావాణిలో 142 దరఖాస్తులు

హైదరాబాద్ ఆగస్ట్ 18,(జే ఎస్ డి ఎం న్యూస్)
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన 248వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 142 దరఖాస్తులుఅందాయి.వాటిలో రెవెన్యూ శాఖకు 32, మున్సిపల్ శాఖకు 29, హోం శాఖకు 16, ప్రవాసి ప్రజావాణికి 02, ఇతర శాఖలకు 63 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.
వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వివిధ విభాగాల సిబ్బందిసమస్యలపై సీ.ఐ.టీ.యు.అనుబంధ సంఘం నాయకులతో కూడిన సభ్యులు సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *