బల్కంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు..పాల్గొన్న మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి.

బల్కంపేట ఆగస్టు 18,(జే ఎస్ డి ఎం న్యూస్)
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట్‌లో మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆలియా మధు గౌడ్, దాసరి విజయ్ కుమార్ గౌడ్, పద్మల నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎన్డీ ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ బహుజన రక్షకుడు, వీరయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ సమాజానికి అందించిన సేవలు అసమానమైనవని కొనియాడారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాట పటిమ, ఆశయాలు నేటి యువతరానికి ఎంతోస్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళిసికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడుగుండగోని భరత్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు బి. శ్యామ్ సుందర్ గౌడ్, బీజేపీ యువ
నాయకుడు మర్రి పురూరవ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, నాయకులు నక్క శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి రాజు గౌడ్, కందుకూరి అనిల్ కుమార్ గౌడ్, దశరథ్ గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *