సామాన్యులకూ ఉన్నత శిఖరాలు సాధ్యమే.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

హైదరాబాద్ ఆగస్ట్ 18,(జే ఎస్ డి ఎం న్యూస్)
సామాన్యులు సైతం కలలు కంటూ అత్యున్నతశిఖరాలనుఅధిరోహించవచ్చని 17వ
శతాబ్దంలోనే నిరూపించిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. హైదరాబాద్ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయనపాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బహుజనులను ఏకం చేసి గోల్కొండ కోటను సాధించి అద్భుత పాలన అందించిన పాపన్న పోరాటంమనందరికీ ఎల్లప్పుడూస్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అణచివేతను, బానిసత్వాన్ని ఏనాడూ సహించని తెలంగాణ గడ్డపై, ఆ మహనీయుల ఆశయాలు, స్ఫూర్తితోనే నేడు రాష్ట్రంలో ‘ప్రజా ప్రభుత్వం’ నిరంతరం పనిచేస్తోందని స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో, సమాజంలో తలెత్తుకుని జీవించేలా తమ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలను అమలు చేస్తోందని ఆయనవివరించారు డాక్టర్ బి.ఆర్.
అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి మహనీయుల ఆశయ సాధనే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో మనమందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *