11 వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ గేమ్స్–2026లో పోటీలలో పతాకం సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు -భవిష్యత్తు పోటీలలో కూడా సత్తా చాటి రాష్ట్ర పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెంచాలి: జిల్లా ఎస్పీ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బయో ఇండోర్ స్టేడియంలో జూలై 23 నుంచి 30 వరకు నిర్వహించిన 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్–2026 పోటీల్లో భాగంగా జరిగిన పెన్‌కక్ సిలట్ (Pencak Silat) 80-85 కేజీల విభాగంలో గోల్డ్ పతకం (ప్రధమ స్థానం) సాధించిన డి.ఎన్.బి రత్నబాబు@ గోపి (PC- 2609, పుల్లల చెరువు పి.యస్ మార్కాపురం జిల్లా) ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే, మరోవైపు క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో నిరంతరం సాధన చేస్తూ జాతీయ స్థాయిలో పతాకం సాధించడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది జాతీయ స్థాయిలో గోల్డ్ పతాకం సాధించడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జరిగే పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రపంచ పోలీస్ క్రీడా పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *