ముఖ్యమంత్రి తన భాషను మార్చుకోవాలి… నోటిని అదుపులో పెట్టుకోవాలి. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట ఆగస్టు 20 (జె ఎస్ డి ఎం న్యూస్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషనుమార్చుకోవాలని, నోటిని
అదుపులో పెట్టుకోవాలని మాజీమంత్రి, బి ఆర్ ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ని అనే విషయాన్ని మరిచిపోయి గౌరవం, సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. కరోనా సమయంలో సరిపడా ఆక్సిజన్, బెడ్ లు లేక ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాల కోసం ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సనత్ నగర్, అల్వాల్, కొత్తపేట ప్రాంతాలలో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. తమ ప్రభుత్వ హయాంలోనే 60 శాతం పనులు పూర్తయ్యాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సనత్ నగర్ టిమ్స్ ను మేమే కట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం అవివేకం అని విమర్శించారు. హాస్పిటల్ లో అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించకుండా హడావుడిగా ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ సభలో అధికారిక కార్యక్రమం అనే సోయి లేకుండా వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల ముందు ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం లో కొబ్బరికాయ లు కొట్టి చేతులు దులుపుకున్నారని మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ లు చేస్తున్నారని వివరించారు. కానీ ఎదుటి వారి పట్ల గౌరవం, సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని అన్నారు. తమకు సంస్కారం అడ్డం వస్తుందని, లేదంటే మీకన్నా ఎక్కువ మాట్లాడగలమని చెప్పారు. మహంకాళి జాతరకు వస్తే స్థానిక ఎమ్మెల్యే గా ముఖ్యమంత్రి కి గౌరవ ప్రదంగా స్వాగతం పలికిన విషయాన్ని గుర్తు చేశారు. 6 సార్లు ఎమ్మెల్యే గా, 4 సార్లు మంత్రిగా పని చేసిన తన పట్ల ముఖ్యమంత్రి వాడిన భాష, పదాలు అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. ప్రజాపాలన అని ఒక వైపు ప్రచారం చేసుకుంటూ మరో వైపు నిర్బందాలు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కమిషన్ ల కోసమే 22 ఏ

కమిషన్ ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం 22 ఏ తీసుకొచ్చిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల ఇండ్లు, ప్రయివేట్ భూములను 22 ఏ లో చేర్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22 ఏ ను అడ్డం పెట్టుకొని భూముల యజమానులను భయపెట్టి 30 నుండి శాతం కమిషన్ లను వసూలు చేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తప్పిదాలు చేసి అధికారులపై నెపం పెట్టి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని విమర్శించారు.

ఓట్లు పోకుండా చూడాలి

నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారి ఓట్లు పోకుండా చూడాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన డ్రాఫ్ట్ లిస్ట్ ఆధారంగా మీమీ ప్రాంతాలలో ఉన్న వారి ఓట్లు ఉన్నాయా, లేదా పరిశీలన చేయాలని చెప్పారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 16 వ తేదీ వరకు అవకాశం ఉందని చెప్పారు. జాబితాలో పేర్లు లేనివారు ఉంటే ఓటు నమోదు కోసం వెంటనే ఫారం 6 ను సమర్పించే విధంగా చూడాలని అన్నారు. SIR కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని భాగస్వాములను చేయాలని కోరారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందే నాగులు, టి. శ్రీహరి, కిషోర్, దాడి ప్రవీణ్ రెడ్డి, లక్ష్మీపతి, ప్రేమ్, కొండాపురం మహేష్ యాదవ్, శేఖర్, ఆరీఫ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, అబ్బాస్, నాగలక్ష్మి, కౌసల్య, సీమ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *