బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మల్లిఖార్జున రావు అన్నారు. తూర్పుగంగవరం, గుంటి గంగ పరిసర ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించి చెట్ల వద్ద ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేయించారు. బహిరంగ ప్రదేశాలను అపరిశుభ్రం చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
